NTV Telugu Site icon

Palnadu: పల్నాడు జిల్లా పీసపాడులో టెన్షన్.. టెన్షన్

Palnadu

Palnadu

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పై టీడీపీ నాయకుడు కంచేటి సాయిబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కంచేటి సాయికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు వైసీపీ శ్రేణులు. తమ నాయకుడు పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కర్రలు చేత పట్టి టీడీపీ నాయకుడు సాయిబాబు ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈరోజు తాడోపేడో తేల్చుకుంటామంటూ వైసీపీ శ్రేణులు భారీ ఆందోళనకు దిగారు. దీంతో.. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగే పరిస్థితి ఉండటంతో.. ఈ క్రమంలో టీడీపీ నాయకులకు నోటీసులు ఇచ్చి గ్రామం నుండి పంపించారు పోలీసులు. దీంతో పీసపాడు గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.