Thorrur Municipality: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత..

  • తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత
  • తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు
  • 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారు
Errabelii

Errabelii

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపాలిటీలలో వార్డు మెంబర్లు, కార్పొరేషన్ లలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనున్నది. అనంతరం కార్పొరేషన్ లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రారంభంకానుంది. వీటితో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌, వైస్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత నెలకొంది.

Also Read:Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్‌ అవుతోన్న కామెంట్‌

తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మెజార్టీ స్థానాలు మేమే గెలిచాం.. ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ ఏదో చేయాలని చూస్తోంది.. రాజ్యాంగ బద్దంగా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం మాదే.. 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారు.. ఎంపీ కడియం కావ్య 2025లో వరంగల్‌లో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారు.. ఎంపీ కావ్య ఓటు పరిగణలోకి తీసుకుంటే కోర్టుకు వెళతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.