Site icon NTV Telugu

MLC Duvvada Srinivas House: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్‌..

Duvvada

Duvvada

MLC Duvvada Srinivas House: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అయితే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి ఎదుట కారులో నిరీక్షిస్తున్నారు టెక్కలి జడ్పీటీసీ, శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణి.. అయితే, గత రాత్రి కుమార్తెలు నిరీక్షించి.. దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా.. ఈ రోజు ఆయన భార్య కూడా వచ్చారు.. దువ్వాడ శ్రీనివాస్‌ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దువ్వాడ వాణి.. దివ్వల మాధురి అనే వైసీపీ నేతపై సంచలన ఆరోపణలు చేసింది.. ఇక, ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడంతో మరింత ఆగ్రహానికి గురవుతున్నారు దువ్వాడ వాణి.. ఏ క్షణంలోనైనా ఇంటిలో ప్రవేశించేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దువ్వాడ గృహానికి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. దువ్వాడ నూతన గృహం ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గేట్‌ను పలుమార్లు కొట్టారు ఆయన కుమార్తె హైందవి.. ఇక, కారులోనే దువ్వాడ వాణి నిరీక్షిస్తున్నారు..

Read Also: Nizamabad: ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ అధికారి.. భారీ మొత్తంలో నగదు సీజ్

Exit mobile version