తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల ముందే వైన్ షాపులకు టెండర్లను పిలిచేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమైంది. 2023-25 సంవత్సరానికి గాను.. మరో రెండు మూడు రోజుల్లో వైన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని.. అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దరఖాస్తులకు ఈ నెల 18న చివరి అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక, ఈ నెల 20 లేదా 21న డ్రా పద్దతిలో ఈ వైన్ షాప్స్ ను కేటాయిస్తారని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Read Also: AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. కీలక వాదనలు వినిపించిన సీఐడీ
అయితే, 2021లో మాదిరిగానే ఈసారి కూడా దరఖాస్తుల విక్రయాల ద్వారా 15 వందల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ భావిస్తుంది. 2021లో నూతన మద్యం పాలసీలో భాగంగా తెలంగాణలో కొత్తగా 404 వైన్ షాప్స్ పెరిగడంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2, 216 నుంచి 2, 620కి పెరిగింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త మద్యం దుకాణాల్లో భాగంగా గౌడ్ లను 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది.
Read Also: Malvi Malhotra: వైట్ శారీలో మెరిసిపోతున్న ‘’కుమారి’’
కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా మద్యం షాప్స్ ను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో గౌడ్స్ కు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలను రిజర్వేషన్ల ప్రతిపాదికన కేటాయించగా.. మిగిలిన 1864 వైన్ షాప్స్ ఓపెన్ కేటగిరిలో ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా, 2021లో మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ ఆహ్వానించగా.. అప్లికేషన్ల రూపంలో రూ.1357 కోట్ల ఆదాయం రాగా.. సుమారు 67,849 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాప్ కు దాదాపు 26 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
