NTV Telugu Site icon

Char Dham Yatra : తాత్కాలికంగా చార్ధామ్ యాత్ర నిలిపివేత..

Chardham

Chardham

Char Dham Yatra: ఉత్తరాఖండ్‌ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా, భక్తులందరూ జూలై 7న రుషికేశ్ దాటి చార్ ధామ్ యాత్రకు వెళ్లవద్దని అభ్యర్థించారు. ఇప్పటికే యాత్రకు వెళ్లిన వారు తమ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు వాతావరణం అనుకూలించే వరకు ఎక్కడున్నా వేచి ఉండాలని ఆయన కోరారు.

Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌ లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండలపై కొండచరియలు విరిగి పడ్డాయని, కొండలపై నుంచి పడిన శిధిలాల కారణంగా బద్రీనాథ్‌ కు వెళ్లే హైవే చాలా చోట్ల మూసుకుపోయిందని సమాచారం. శనివారం నాడు చమోలి జిల్లాలోని కర్ణప్రయాగ్‌ లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో కొండపై నుండి పడిపోయిన రాళ్లతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించారు. వారు బద్రీనాథ్ నుండి మోటార్ సైకిల్‌ పై తిరిగి వస్తుండగా ఈ సమయంలో ప్రమాదానికి గురయ్యాడు.

PM Modi : ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్తున్న ప్రధాని మోడీ

ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ్‌ లో అలకనంద ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. అలకనంద విష్ణు ప్రయాగలో ధౌలి గంగలో విలీనమవుతుంది.