Site icon NTV Telugu

Guntur: ఆలయంలో ఉద్యోగి చేతివాటం.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Employee

Employee

Guntur: గుంటూరు జిల్లాలో తెనాలి వైకుంఠపురంలో మహిళా ఉద్యోగ చేతివాటం బయటపడింది. దేవాలయంలోని కానుకల హుండీ లెక్కింపు సందర్భంగా స్వామివారికి వచ్చిన కానుకల్లోని ఉంగరాన్ని దొంగతనం చేసింది మహిళా ఉద్యోగి. సూపరిండెంట్‌ హోదాలో ఉన్న నిర్మలారాణి కానుకలు లెక్కేస్తున్న సందర్భంగా స్వామివారికి వచ్చిన ఉంగరాల్లోని ఉంగరాన్ని తన చేతికి పెట్టేసుకుంది. విషయాన్ని గమనించిన ఆలయ సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: Rain Effect : ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో పెళ్లి.. వీడియో కాన్ఫరెన్స్‌లో బంధువులు..

అయితే సదరు మహిళా గతంలోనూ ఇదే తరహా ఘటనతో శాఖ పరమైన చర్యలకు గురైనట్లు తెలుస్తోంది. మరోసారి ఇదే తరహా దొంగతనానికి పాల్పడటంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మహిళా ఉద్యోగినిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దొంగతనానికి పాల్పడిన నిర్మలరాణిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version