Tamarind Pulihora Recipe: పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో పండుగలు, వ్రతాలు, దేవాలయంలో పెట్టె ప్రసాదాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సంప్రదాయ వంటకం. అందులో కూడా చింతపండు పులిహోర ప్రత్యేకమైన రుచి, సువాసనతో ప్రసాదం స్టైల్ లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పులిహోర తయారీ విధానం కొంచెం భిన్నంగా ఉండటం వల్ల దీని రుచి మరింత ఘుమఘుమలాడుతుంది. మరి దీని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూసేద్దాము.
BCCI Central Contracts: టీమిండియాలో ప్రకంపనలు.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ భారీ షాక్!
ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లతో ఒక గంట పాటు నానబెట్టాలి. అనంతరం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ప్రెషర్ కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అన్నం పొడిపొడిగా ఉడికిన తర్వాత ఒక పెద్ద ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న రెండు చింతపండ్లను (సుమారు 80 గ్రాములు) ఒక కప్పు వేడి నీటిలో 15 నిమిషాలు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
తర్వాత పాన్ లో ఆరు టేబుల్ స్పూన్ల నూనెతో పాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పల్లీలు వేయించాలి. ఆపై ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చివరగా జీడిపప్పు వేసి వేయించి కొంత భాగాన్ని పక్కన పెట్టాలి. అదే పాన్ లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి చింతపండు గుజ్జు కలపాలి. ఆ తరువాత పసుపు, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి నూనె విడిపించే వరకు మిశ్రమాన్ని ఉడికించాలి.
Chinnu Pappu: అనుమానాస్పద స్థితిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య!
ఇక మిక్సీలో ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేడి తగ్గిన అన్నంపై చల్లి, చింతపండు పేస్ట్, ముందుగా వేయించిన పప్పులు వేసి బాగా కలిపితే ఆవపెట్టిన చింతపండు పులిహోర సిద్ధం అవుతుంది. ఈ పులిహోర ప్రసాదం రుచిని గుర్తు చేస్తూ పండుగల సమయంలో లేదా ప్రత్యేక సందర్భాల్లో వడ్డిస్తే అందరికీ నచ్చే వంటకంగా నిలుస్తుంది.
