NTV Telugu Site icon

Temperatures Drop: ఏజెన్సీలో వణికిస్తున్న చలి..

Untitled 1

Untitled 1

Temperatures Drop: తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు, శీతల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో పర్యటాక ప్రాంతాలు టూరిస్టులతో కోలాహలంగా మారాయి..

Read Also: Nuclear War: అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే ఫైల్పై పుతిన్‌ సంతకం..

మరోవైపు.. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్‌ డిజిట్‌లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఆదిలాబాద్‌ జిల్లా పొచ్చెరలో 11.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా తాండ్రలో 11.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. ఇక, హైదరాబాద్‌లోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు కిందికి దిగుతున్నాయి.. దీంతో.. ఉదయం పూట బయట రోడ్డెక్కితే వణికిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. మొన్నటి కంటే నిన్న తక్కువ.. నిన్నటి కంటే నేడు తక్కువ అన్నట్టుగా రోజురోజుకి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి ఉష్ణోగ్రతలు..

Show comments