ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. 44-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఈ సీజన్ తన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది.
Read Also: Ahmedabad: అర్ధరాత్రి రెచ్చిపోయిన అల్లరిమూకలు.. కార్లు, బైకులు ధ్వంసం
తమిళ్ తలైవాస్ జట్టులోఅత్యధికంగా నరేందర్ హోషియార్, సచిన్ 10 పాయింట్లతో రాణించారు. వారికి తోడు సాహిల్ సింగ్ 5 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత.. విజయ్ మాలిక్ 9 పాయింట్స్ చేశాడు. తమిళ్ తలైవాస్ జట్లులో టాకిల్ పాయింట్లు ఎక్కువగా ఉండటంతో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కాగా.. మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. టైటాన్స్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన జైపూర్ పింక్ ప్యాంథర్స్‌తో మూడో మ్యాచ్‌లో తలపడనుంది.
Read Also: GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..!