Site icon NTV Telugu

Veritas Sainik School: వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్

Veritas Sainik School

Veritas Sainik School

కొందరి ఉపాధ్యాయుల తీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రవర్తనతో, చేష్టలతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచార యత్నాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా ములుగు (మం) లక్ష్మక్కపల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు తెలుగు టీచర్. విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Also Read:Euphoria : గుణశేఖర్ యూత్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘యుఫోరియా’ అప్ డేట్ ..

టీచర్స్ డే సెలబ్రేషన్ ప్రొగ్రాంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు తెలుగు టీచర్ ప్రణయ్. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ని అందరికి బయటికి పంపి బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భయపడిపోయిన బాలిక కేకలు వేయడంతో టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్కూల్ యాజమాన్యం విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడింది. అయితే విద్యార్థిని ఈ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ములుగు పోలీసులు కీచక టీచర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

Exit mobile version