NTV Telugu Site icon

Telugu Student: విద్య కోసం విదేశాలకు వెళ్లి.. తిరిగి రాని లోకాలకు..

Telugu Student

Telugu Student

Telugu Student: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది.. హైదరాబాద్ చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లుగా విచారణ సంస్థలు ధ్రువీకరించాయి. హైదరాబాద్ నుంచి కొన్నాళ్ల క్రితమే ఉన్నత చదువుల కోసం టెక్సాస్‌కు వెళ్లిన ఐశ్వర్య మృతి చెందిన సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న టెక్సాస్‌లోని అలెన్ మాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయారు.

Read Also: Rakshita Suresh: ప్రముఖ సింగర్‌కి తప్పిన ప్రమాదం.. చావు అంచులదాకా వెళ్లి..

ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తాడికొండ ఐశ్వర్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాటికొండ ఐశ్వర్య మరణించారు. తాటికొండ ఐశ్వర్య మరణించినట్లు తెలుగు సంఘాలు ధ్రువీకరించాయి. తాటికొండ ఐశ్వర్య కొత్తపేటలో నివాసం ఉంటారు. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తెనే తాటికొండ ఐశ్వర్య. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి.

అమెరికాలో కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెక్సాస్‌లోని ఓ మాల్‌కు శనివారం మధ్యాహ్నం కారులో వచ్చిన దుండగుడు జనంపైకి ఇష్టారాజ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అక్కడి వారంతా భయంతో కేకలు వేస్తూ రక్షణ కోసం పరుగులు తీశారు. కాల్పుల శబ్దాలు, జనం కేకలతో అక్కడ విధుల్లో ఉన్న ఓ పోలీసు అప్రమత్తమై సాయుధున్ని కాల్చి చంపాడు.అప్పటికే దుండగుని కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో కన్నుమూశారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అమెరికాలో ఈ ఏడాదిలో నాలుగు నెలల్లోనే ఇప్పటిదాకా 198 కాల్పుల ఘటనలు జరగడం గమనార్హం.