NTV Telugu Site icon

Andhra Pradesh: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. స్వస్థలానికి మృతదేహం..

Student

Student

Andhra Pradesh: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి కొంతమంది ప్రాణాలు విడిచిన సందర్భాలు ఉన్నాయి.. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు దుండగుల చేతుల్లో.. ఇంకాకొందరు సన్నిహితుల చేతుల్లోనే హత్యకు గురయ్యారు.. ఇప్పుడు అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండియర్‌ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్.. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హత్య చేయబడ్డాడు.. అభిజిత్‌ వయస్సు 20 ఏళ్లు.. ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అభిజిత్‌ను హత్యచేసినట్టుగా తెలుస్తోంది.. అయితే, సెల్ నంబర్ ఆధారంగా మృతదేహాన్ని అడవిలో గుర్తించారు అమెరికా పోలీసులు.. ఇక, శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి అభిజిత్ మృతదేహాన్ని తరలించారు పోలీసులు.. అభిజిత్ మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు, బంధువులు.. ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన కుమారుడు.. ఇలా హత్యకు గురికావడంతో వారిని దుఖాన్ని ఆపడం ఎవరివల్ల కావడం లేదు.

Read Also: RPF Recruitment 2024: రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలివే..