దేశంలో 5జీ నెట్‌వర్క్ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్‌వర్క్ గ్రామాలకు సైతం విస్తరించింది. టెలికాం నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. 5జీ సేవలు మరిన్ని మారుమూల గ్రామాలకు చేరవేచే పనిలో ఉంది. అయితా తాజాగా ఓ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో5జీ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో రిలయన్స్ జియో నెంబర్ వన్‌గా అవతరించింది. ఇది మాత్రమే కాకుండా లభ్యతలో కూడా జియో మెరుగైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) ఈ విషయాన్ని వెల్లడించింది.
READ MORE: Srisailam Temple: శ్రీశైలం ఈవో డి.పెద్దిరాజు బదిలీ
ఈ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్‌వర్క్ లభ్యత స్కోర్‌తో వేరే నెట్‌వర్క్‌ల కంటే ముందుది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉంది. 10 పాయింట్ల స్కేల్‌పై జియో 9.0 పాయింట్ల స్కోర్‌తో.. దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్‌టెల్ (7.1 స్కోర్) కంటే ముందు వరసలో నిలుస్తోంది. జియో ఎప్పటికప్పుడు నిరంతరాయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతుండటంతో వినియోగదారులు ఈ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. జియో, ఎయిర్‌టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా 3.7 పాయింట్ల స్కోర్, బీఎస్ఎన్ఎల్ 1.2 పాయింట్ల స్కోర్స్‌తో కొనసాగుతున్నాయి.
READ MORE: Andhra Pradesh: గుడ్‌న్యూస్.. రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు అనుమతి