Site icon NTV Telugu

Oscar 2025: ఆస్కార్ రేసులో ఆ ఐదు తెలుగు చిత్రాలు..

Tw

Tw

Oscars 2025: ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రంగం, కళా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆస్కార్ తాకాలనే కోరిక ఉంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశం నుంచి ప్రతీ ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతుంటాయి. కానీ అది అంత సులభం కాదు. అయితే.. ఆస్కార్ రేసులో తెలుగు చిత్రాలు పోటీపడనున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కుబేర సినిమాలు ఆస్కార్‌కి ఎంపికయ్యాయి. 2025 ఆస్కార్ అవార్డులకు భారత్ తరపున అధికారిక నామినేషన్ పొందాయి. ఇప్పటికే ఈ చిత్రాలు భారీ రికార్డులు సాధించాయి.

READ MORE: Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్

సంక్రాంతికి వస్తున్నాం..
ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

READ MORE: Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు.. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ

పుష్ప 2
అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో రూపొందించిన పుష్ప సెకండ్ పార్ట్ సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పుష్ప ది రైజ్ రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటించిన దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో తెచ్చుకుంది. అయితే సినిమా రిలీజ్ అయిన నెల తరువాత మరో 20 నిమిషాల నిడివి పెంచుతూ సినిమా యూనిట్ మరొక వర్షన్ రీలోడేడ్ అంటూ రిలీజ్ చేసింది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

READ MORE: Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు.. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ

గాంధీ తాత చెట్టు..
‘పుష్ప 2’ త‌ర్వాత సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన చిన్న చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న‌య సుకృతివేణి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారి కావ‌డంతో సినిమా మ‌రింత ప్ర‌చారంతో ప్రేక్షకుల దృష్టిని ఆక‌ర్షించింది. గాంధీ అనే అమ్మాయి, ఓ చెట్టు, దాన్ని నాటిన తాత చుట్టూ సాగే క‌థ ఇది. గాంధీజీ సార‌థ్యంలో జ‌రిగిన ఉప్పు స‌త్యాగ్రహంలాగే.. తన ఊరి కోసం, త‌న తాత నాటిన ఓ చెట్టు కోసం నేటి గాంధీ చేసిన మ‌రో స‌త్యాగ్రహమే ఈ సినిమా. ‘శంక‌ర్‌దాదా జిందాబాద్‌’లో అగ్ర హీరో గాంధీ గిరి చేస్తే, ఈ సినిమానేమో ఓ చిన్నారి చేసిన గాంధీ గిరితో సాగుతుంది. రామ‌చంద్రయ్య, ఆయ‌న కుటుంబం, ఆద‌ర్శాల్ని ఒంట‌బ‌ట్టించుకున్న మ‌న‌వ‌రాలు గాంధీ, ఊరు, చెట్టుని ప‌రిచ‌యం చేస్తూ ఆరంభంలోనే క‌థ‌లో లీనం చేశారు ద‌ర్శకురాలు. ముఖ్యంగా గాంధీ పాత్రలోని స్వచ్ఛత హృద‌యాల‌కి హ‌త్తుకునేలా తెర‌పై ఆవిష్కరించారు.

READ MORE: Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు.. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ

కుబేర..
సున్నితమైన కథల్ని బలమైన భావోద్వేగాలతో నింపి ప్రేక్షకులకు హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు శేఖర్‌ కమ్ములది ప్రత్యేక శైలి. ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ తర్వాత ఇప్పుడాయన ‘కుబేర’ అంటూ మరో ఆసక్తికర కథను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించడం.. టీజర్, ట్రైలర్‌, పాటలు అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు రెట్టింపయ్యాయి. ధనవంతుల అత్యాశకు, పేదవాళ్ల ఆకలికి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్య రూపమే ఈ చిత్రం. భిన్న ధ్రువాలైన ఈ ఇద్దరి వ్యక్తుల జీవితాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయి? వాళ్ల మధ్య సంఘర్షణ ఎందుకు తలెత్తిందనేది ఆసక్తికరం. ఈ పాయింట్‌ను దర్శకుడు చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. సినిమా ఆరంభంలోనే ఆపరేషన్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ సీక్వెన్స్‌తో తను చెప్పాలనుకున్న పాయింట్‌ను సిద్ధం చేసుకున్నారు. సీబీఐ అధికారిగా దీపక్‌ పాత్రను పరిచయం చేసిన తీరు.. వ్యవస్థకు వ్యతిరేకంగా అతను పనిచేయడానికి సిద్ధపడటం.. ఈ క్రమంలో నీరజ్‌ అవినీతి వ్యవహారంలో భాగమవ్వడం ఆసక్తిరేకెత్తించేలా ఉంటాయి.

కన్నప్ప..
మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం కన్నప్ప ఈ సినిమాలో మోహన్లాల్, శరత్ కుమార్, ప్రభాస్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. భక్త కన్నప్ప జీవిత కథ చాలామందికి తెలిసిందే. ఇదివరకే తెరకెక్కి, విజయాన్ని అందుకున్న గొప్ప కథ. భక్తి, భావోద్వేగాలే ఇందులో కీలకం. కన్నప్ప జీవితంలోని భక్తి సారాన్ని పక్కాగా తెరపైకి తీసుకురావడంలో ఈ చిత్రం విజయవంతమైంది. చెబుతున్న కథ ఏదైనా సరే, నేటితరం ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకొచ్చామనేదే ఇప్పుడు కీలకం. అదే సినిమాల ఫలితాల్ని ప్రభావితం చేస్తుంటుంది. ఆ విషయాన్ని గుర్తెరిగిన చిత్రబృందం నవతరాన్ని ఆకట్టుకునేలా బలమైన సాంకేతిక హంగులు, అడుగడుగునా ఆకర్షించే తారాగణంతో ఈ సినిమాని తీర్చిదిద్దింది.

Exit mobile version