Site icon NTV Telugu

November Movies: నవంబర్లో రిలీజ్ అయ్యే సినిమాలివే..

Cenema

Cenema

November Movies: సాధారణంగా నవంబర్ నెలను సినీ పరిశ్రమలో కాస్త డల్ సీజన్‌గా భావిస్తారు. అయితే, డిసెంబర్ మరియు సంక్రాంతి 2026 రేసులో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, కొన్ని డీసెంట్ బజ్ ఉన్న సినిమాలు తమ అదృష్టాన్ని ఈ నవంబర్‌లో పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. రవితేజ నటించిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31నే విడుదలవుతున్నప్పటికీ, దాని ప్రభావం నవంబర్ నెల పొడవునా ఉంటుంది. దీంతో పాటుగా అనేక హిందీ సహా ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఈ నెలలో విడుదల కానున్నాయి. నవంబర్‌లో విడుదల కానున్న కొన్ని డీసెంట్ బజ్ ఉన్న చిత్రాలలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’, సుధీర్ బాబు ‘జటాధార’ వంటివి ఉన్నాయి. ఈ నెలకు సంబంధించిన అప్‌డేట్ చేసిన సినిమా రిలీజ్ ల అప్డేట్స్ కింద హబ్బాయి. చార్ట్ కింద ఇవ్వబడింది:

READ MORE: Sleeper Bus Safety: ఈ నెలలో రెండు ప్రమాదాలు.. 40 మంది మృతి.. ఇంతకీ స్లీపర్‌ బస్సులో ప్రయాణం సురక్షితమేనా..?

నవంబర్ 7
రష్మిక మందన్న – ది గర్ల్‌ఫ్రెండ్
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా – జటాధార
ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ – హక్
ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్
తిరువీర్ – ప్రీ వెడ్డింగ్ షో:

నవంబర్ 14
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే – కాంత
చాందిని చౌదరి, తరుణ్ భాస్కర్ –
సంతాన ప్రాప్తిరస్తు
అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ – దే దే ప్యార్ దే 2

నవంబర్ 21
120 బహదూర్ – ఫర్హాన్ అక్తర్, అమితాబ్ బచ్చన్, రాశీ ఖన్నా
వికెడ్ 2 – ఇంగ్లీష్ చిత్రం

నవంబర్ 28
ఆంధ్ర కింగ్ తాలూకా – రామ్, భాగ్యశ్రీ బోర్సే
తేరే ఇష్క్ మే – ధనుష్, కృతి సనన్
జూటోపియా 2 – ఇంగ్లీష్ చిత్రం

ఈసారి నవంబర్ నెలాఖరు వరకు సినీ అభిమానులకు వినోదానికి లోటు ఉండదని ఈ అర్థమవుతోంది. ముఖ్యంగా, వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటుల సినిమాలు ఈ నెలలో పోటీ పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి సందడి నెలకొనే అవకాశం ఉంది.

 

 

 

Exit mobile version