Telugu Movie Piracy: తెలుగు సినిమాల పైరసీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ – TGCSB) పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. నాలుగు కొత్త తెలుగు సినిమాలు ఆన్లైన్లో లీక్ కావడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలు ఈ పైరసీ బారిన పడ్డాయి. కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియేటర్లో దుండగులు మూడు సినిమాలను రహస్యంగా చిత్రీకరించినట్లు గుర్తించారు. అలాగే నవంబర్ 20న విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా విడుదలైన గంటల్లోనే ఆన్లైన్లో లీక్ అయింది. ఈ వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసింది. ఓ వెబ్సైట్లో ఈ పైరసీ కాపీలను గుర్తించినట్లు సమాచారం. దీంతో పైరసీ వెనుక ఉన్న బాధ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Telugu Movie Piracy: టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ఒకే వెబ్సైట్లో 4 కొత్త సినిమాలు లీక్..

Movie Piracy
