Maha Shivaratri Special: ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు.. శివుడి పాత్రలో ఒదిగిపోయిన హీరోలు వీళ్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Shivaratri Special: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులంతా శివనామ స్మరణలో మునిగితేలుతున్నారు. ఆధ్యాత్మికంగానే కాకుండా, వెండితెరపై కూడా మన సినీ దిగ్గజాలు శివుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటి తరం నటుల వరకు శివయ్య పాత్రలో ఒదిగిపోయిన ఆ స్టార్ హీరోలెవరో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Tejas Thackeray: మాజీ సీఎం కుమారుడికి సీరియస్..
Also Read
నటసార్వభౌముడి ‘దక్షయజ్ఞం’..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఘనత నందమూరి తారక రామారావు (NTR) గారిదే. రాముడు, కృష్ణుడు పాత్రలకే కాకుండా, శివుడి పాత్రకు కూడా ఆయన ఒక నిండుతనాన్ని తీసుకొచ్చారు. ‘దక్షయజ్ఞం’, ‘ఉమాచండి గౌరీ శంకరుల కథ’ వంటి చిత్రాల్లో ఆయన శివుడిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. వెండితెరపై అత్యధిక సార్లు శివుడి పాత్రలో కనిపించిన నటుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు.
చిరంజీవి ‘మంజునాథ’ అవతారం..
మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగానే కాకుండా, భక్తిరస పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. శ్రీ మంజునాథ సినిమాలో మెగాస్టార్ పోషించిన మహాశివుడి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే చిరంజీవి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో కూడా శివతత్వాన్ని చాటిచెప్పే పాత్రలో అద్భుతంగా నటించారు.
బాలయ్య ‘సీతారామ కళ్యాణం’
నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి బాటలోనే పౌరాణిక పాత్రల్లో మెప్పించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో బాలయ్య పరమశివునిగా కనిపించి అలరించారు.
అలనాటి దిగ్గజాలు.. అద్భుత పాత్రలు..
ఏఎన్నార్ (ANR): ‘మూగ మనసులు’ చిత్రంలో ‘గౌరమ్మ నీ మొగుడెవరమ్మా’ పాటలో శివుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారి నటన అజరామరం.
శోభన్ బాబు & కృష్ణంరాజు: అందాల నటుడు శోభన్ బాబు ‘పరమానందయ్య శిష్యుల కథ’లో, రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘వినాయక విజయం’లో శివయ్యగా భక్తి పారవశ్యాన్ని పంచారు.
ప్రకాష్ రాజ్ & సుమన్: ‘డమరుకం’లో ప్రకాష్ రాజ్, ‘శ్రీ సత్యనారాయణ మహత్యం’లో సుమన్ శివుడి పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు.
తాజావార్తలు
-
Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
-
Maryam Nawaz: సీఎం వస్తున్నారని పరీక్షలాపేస్తారా? పాక్ సర్కార్ తీరుపై భగ్గుమన్న తల్లిదండ్రులు!
-
Team India: జట్టు నుంచి తప్పుకున్న పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..
-
Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!