NTV Telugu Site icon

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఆకట్టుకోలేకపోయిన తెలుగమ్మాయి..

Jyothi

Jyothi

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తరఫున పతకాలు కరువు అయిపోయాయి. వినేశ్ ఫొగట్ పై ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఫైనల్‌లో అనర్హత వేటు పడింది. మను భాకర్ రెండు పతకాలతో చెలరేగింది. తాజాగా.. భారత హాకీ జట్టు కూడా కాంస్యంతో మెరిసింది. కాగా.. ఇప్పుడు ఆశలన్నీ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల రజత పతక విజేత, తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్లో ఆకట్టుకోలేకపోయింది. పరుగుల రాణిగా పేరొందిన 24 ఏళ్ల జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించలేకపోయింది.

Read Also: Bangladesh: విద్యార్థులకు మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం.. పోరాటంపై ప్రశంసలు

ఈరోజు జరిగిన 100 మీటర్ల మహిళల హర్డిల్స్ రెపిచేజ్ రౌండ్ లో జ్యోతి 13.17 సెకన్ల టైమింగ్ తో 4వ స్థానంలో నిలిచింది. హీట్స్ (క్వాలిఫైయింగ్ రౌండ్స్)లో అర్హత సాధించలేకపోయినా.. మంచి టైమింగ్ నమోదు చేసినవాళ్లను ఎంపిక చేసి, ఫైనల్ చేరేందుకు వారికి మరో అవకాశం కల్పిస్తారు. దాన్నే రెపిచేజ్ రౌండ్ అంటారు. జ్యోతి రెపిచేజ్ రౌండ్లో కూడా రాణించలేకపోయింది. అయితే.. భారత్ లో మాత్రం 100 మీటర్ల మహిళల హర్డిల్స్ లో అత్యుత్తమ టైమింగ్ జ్యోతిదే. ఈమె ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయి. 100 మీ హర్డిల్స్ లో 12.78 సెకన్లతో టైమింగ్ తో జాతీయ రికార్డు నెలకొల్పింది. కాగా.. పారిస్ ఒలింపిక్స్ లో అంచనాలను సాధించలేకపోయింది.

Read Also: PM Modi: భారత హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు..