Site icon NTV Telugu

C Kalyan: విశ్వ ప్రసాద్ టాలెంట్ లేదనడం కరెక్ట్ కాదు..సీ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Tg Vishwaprasad Interview

Tg Vishwaprasad Interview

తెలుగు సినీ పరిశ్రమలో వేతన పెంపు డిమాండ్‌ నేపథ్యంలో, నిర్మాత సీ కళ్యాణ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు నిర్వహించిన సమావేశం పరిశ్రమలో కీలక పరిణామంగా మారింది. 30% వేతన పెంపు డిమాండ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించడం, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన కొందరిపై చర్యలు తీసుకోవడం వంటి సంఘటనలు సినీ పరిశ్రమలో ఉద్రిక్తతలను పెంచాయి. ఈ సమావేశంలో సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. కార్మికులు 30% వేతన పెంపు కోసం సమ్మెకు దిగగా, నిర్మాతలు, ముఖ్యంగా చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు, ఈ డిమాండ్ ఆర్థిక భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినీ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతా భావం లేదు. కార్మికుల సమస్యలను మేం అర్థం చేసుకుంటాం.

Also Read:Exclusive: సారధి స్టూడియోస్లో కొట్టుకున్న కాస్ట్యూమర్స్?

అయితే, షూటింగ్‌లను అడ్డుకోవడం, సభ్యులను బెదిరించడం వంటి చర్యలను సహించలేము” అని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు సినీ పెద్దలు కృషి చేస్తారని, గతంలో దాసరి నారాయణ రావు లాంటి సీనియర్ నిర్మాతలు ఇలాంటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యల మీద కళ్యాణ్ స్పందించారు. “ఇక్కడ కార్మికులకు టాలెంట్ లేదు” అని విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యను సీ కళ్యాణ్ తప్పుబట్టారు. “ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. మన కార్మికులు అత్యంత నైపుణ్యం కలిగిన వారు. వారి సమస్యలను అర్థం చేసుకుని, సామరస్యంగా పరిష్కారం చూడాలి” అని ఆయన అన్నారు. ఈ సమస్యను రేపటి లోపు పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సినీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version