Site icon NTV Telugu

High Court-KTR: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట!

Ktr

Ktr

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు అయింది.

మూసీ ప్రక్షాళణ పేరుతో ప్రభుత్వం 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఅర్‌ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో 2024 సెప్టెంబరు 30న కేసు నమోదైంది. కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.

Exit mobile version