NTV Telugu Site icon

Tellam Venktrao : కాంగ్రెస్‌లోకి తెల్లం వెంకట్రావ్‌

Tellam Venkatrao

Tellam Venkatrao

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు.

అయితే.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరుకావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తెల్లం వెంకటరావు పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి ఫిర్యాదు చేస్తున్నామని, స్పీకర్ గారు చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా ముందుకు వెళతాం. కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరడం పార్టీ వ్యతిరేక వ్యతిరేక చర్యలు క్రిందకే వస్తుందని, తెల్ల వెంకట్రావు రాజీనామా చేసి పార్టీ మారాలి. లేదంటే స్పీకర్ అనర్హత వేటు వేయాలన్నారు. క పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండని అని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు దేనితో కొట్టాలి..?? అని ఆయన ప్రశ్నించారు.