NTV Telugu Site icon

Telepathically -Elon Musk: మెదడులోని చిప్‌ సాయంతో చెస్‌ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!

8

8

2016లో ఎలన్‌ మస్క్‌ బ్రెయిన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ ‘న్యూరాలింక్‌’ ను సంగతి తెలిసిందే. అంగవైకల్యం వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్టప్‌ కంపెనీ.. న్యూరాలింక్‌. ఈ కంపెనీ తయారు చేసిన బ్రెయిన్‌ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ చిప్‌ ను వైకల్యం పొందుతున్న రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే.. కాళ్లు చేతులు పక్షవాతానికి (క్వాడ్రిప్లెజియా) గురైన పేషెంట్‌ నోలన్‌ అర్బాగ్ అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్‌ చిప్‌ ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో తాను భాగం అవ్వడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం అర్బాగ్‌. ఈయన ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్‌ అమర్చిన వ్యక్తి.

Also read: IPL 2024: నేను సర్ఫరాజ్‌ ఖాన్ తండ్రితో కలిసి ఆడా: రోహిత్ శర్మ

ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్‌ అమర్చిన వ్యక్తి.. ఇప్పుడు తన ఆలోచనల ద్వారా కంప్యూటర్‌ ను నియంత్రించగలడని, అలాగే ఆలోచనల ద్వారా వీడియో గేమ్‌ లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇకపై ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితమైన వారు, పక్షవాతంలో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లకు కూడా న్యూరాలింక్‌ పని చేస్తుందని మస్క్‌ ప్రకటించారు.

Also read: IPL 2024: ఐపీఎల్‌ వేళ 10 జట్ల కెప్టెన్ల సక్సెస్‌ రేటు ఎంతో తెలుసా..?

ఇందుమూలంగా ఇంతకాలం అసాధ్యం అనుకున్నపనిని తమ టీం సుసాధ్యం చేసినట్లు ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇక తాజాగా పక్షవాతానికి గురైన వ్యక్తి మైండ్‌ కంట్రోల్‌ చిప్‌ సాయంతో అతనితో చెస్‌ ఆడాడు. దాంతో తాము చారిత్రాత్మక మైలురాయి చేరుకున్నట్లు మస్క్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయోగాలు ‘న్యూరాలింక్‌’ మాత్రమే కాకుండా మరికన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలో న్యూరాలింక్‌ కంటే ముందే.. యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ ను అమర్చింది.