NTV Telugu Site icon

Damodara Raja Narsimha : వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ టెలికాన్ఫరెన్స్

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలపై దిశ నిర్దేశం చేశారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో.. 1, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం – 15 రోజుల లోపల ప్రసవం ఉన్న గర్బిణి మహిళల సంక్షేమానికై తీసుకున్న ముందస్తు చర్యలపై చర్చించారు. మందులు వాటి నిల్వల స్థితి. ఆసుపత్రులకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు. అత్యవసర వాహనాల అందుబాటు. టీకాలు, పారిశుద్ధ్యం – ముఖ్యంగా హై రిస్కు గుర్తించిన ప్రాంతాల్లో, పంచాయతీ రాజ్ మరియు మునిసిపల్ శాఖలతో సమన్వయం. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలలో ఎటువంటి అంతరాయానికి చోటు లేకుండా జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వరదల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫాగింగ్ , దోమల నివారణ చర్యలు కొరకు Vector Borne Deceases Control కోసం చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చేపట్టిన చర్యల పై రోజు వారి నివేదిక ను ఆయా శాఖల ఉన్నతాధికారులకు నివేదించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Skin Beauty Secret: రోజూ ఈ జ్యూస్‌లు తాగితే.. చర్మం సౌందర్యం పెరిగి యవ్వనంగా కనిపిస్తారు!
 

 

Show comments