కొన్ని జ్యూస్ లు తాగితే బరువు తగ్గడమే కాకుండా చర్మం మెరుస్తుంది.  అవేంటో ఇప్పడు చూద్దాం.  

 నిమ్మరసంలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తుంది.

 నిమ్మలోని ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి.  

నిమ్మరసంలోని విటమిన్ సీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

  పుచ్చకాయ, దోసకాయ, తులసి ఆకులతో తయారు చేసిన జ్యూస్ తాగితే స్కిన్ గ్లో పెరుగుతుంది.  

  క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ ఎగా మారి చర్మం పోషణను మెరుగుపర్చుతుంది. 

  రోజు ఉదయం ఈ జ్యూస్ తాగితే చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా కనిపిస్తుంది.  

  దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-సి, విటమిన్ -కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

  ఉదయం పూట ఈ పండ్లతో తయారు చేసిన జ్యూస్ తాగితే ఇందులోని పోషకాలు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.  

  పాలకూర, కీరదోస వంటి తాజా ఆకుపచ్చ కూరగాయలతో చేసిన జ్యూస్ ఉదయాన్నే తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 

  చర్మం కణాలు యాక్టివ్‌గా మారి ముఖం ఛాయను పెంచుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్లు శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేస్తాయి.  

 పసుపులో కుర్కుమిన్, అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది చర్మం ఛాయను మెరుగుపర్చే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.