NTV Telugu Site icon

Grama Sabalu : నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు

Grama Sabhalu

Grama Sabhalu

Grama Sabalu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయబోయే నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గతంలో అందిన దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ సర్వే బృందాలు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించి, అర్హుల జాబితాను రూపొందించి సంబంధిత అధికారులకు అందించారు. ఈ జాబితాలను గ్రామ, వార్డు స్థాయి సభల్లో బహిరంగంగా చదవనున్నారు. జాబితాలో ఉన్న పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఆయా అభ్యంతరాలను స్వీకరించేందుకు ఇంచార్జి అధికారులను నియమించారు.

ఎంపీడీఓ ఆధ్వర్యంలో విలేజ్ సెక్రటరీ, ఆర్‌ఐ, ఏఈవో, ఏవోలు టీంలు గ్రామ స్థాయిలో పనిచేస్తూ అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులను స్వీకరిస్తాయి. ఈ నెల 26 నాటికి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసి, గ్రామసభల్లో ఆమోదించబడుతుంది.

ప్రధాన పథకాలు:

రేషన్ కార్డులు: ఆమోదిత జాబితా ప్రకారమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడతాయి.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి జాబితా తయారు చేయబడింది.
రైతు భరోసా: సాగు భూములు ఉన్న రైతులకు రూ. 12,000 పెట్టుబడి సాయం అందజేస్తారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: భూమిలేని కూలీలకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం అందించనున్నారు.

ఫీల్డ్ సర్వే వివరాలు:

సర్వేలో 17,000 ఎకరాల సాగు చేయని భూములను గుర్తించారు.
రియల్ ఎస్టేట్ కోసం వినియోగిస్తున్న భూములను రైతు భరోసా పథకానికి అనర్హంగా తేల్చారు.
నిజామాబాద్‌లో 8,575 ఎకరాలు, కామారెడ్డిలో 8,500 ఎకరాలు సాగుకు అనర్హంగా గుర్తించారు.

గ్రామ సభలలో లబ్ధిదారుల జాబితా:

ఫీల్డ్ సర్వే బృందాలు సొంత స్థలం ఉన్న లబ్ధిదారుల వివరాలను సేకరించి జాబితా రూపొందించాయి.
మిస్ అయిన పేర్లను పునఃసమీక్షించి, అవసరమైతే కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ముఖ్యంగా దివ్యాంగులు, పంచాయతీ కార్మికులు, ఇండ్ల లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

సమగ్ర ప్రచారం ఆదేశాలు:

జనవరి 21 నుండి 24 వరకు జరగనున్న గ్రామ, వార్డు సభల గురించి విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.
ఆయా సభల్లో లబ్ధిదారుల జాబితాలను వివరించి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించాలి.
పథకాలకు సంబంధించిన కొత్త దరఖాస్తులను పరిశీలించి, తుది జాబితాను ఆమోదించాలి.

ఉపాధి హామీ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక:
ఉపాధి హామీ కింద 2023-24లో కనీసం 20 రోజులు పని చేసిన వారి జాబితాను గుర్తించి, భూమిలేని 25,501 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. తుది జాబితా గ్రామసభల ద్వారా ఆమోదించబడుతుంది. ఈ చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

SV University: ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం!