NTV Telugu Site icon

Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు!

Telangana Rains Today

Telangana Rains Today

Telangana Weather Forecast Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో వాతావరణం చల్లబడగా.. చలి తీవ్రత పెరిగింది. గత 10 రోజులుగా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

మంగళవారం నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెంమీలు, నిజామాబాద్‌ నార్త్‌లో 4.35 సెంమీలు, నిజామాబాద్‌లో 3.93 సెంమీలు, నిజాంపేటలో 3.58 సెంమీలు, గోపన్‌పల్లిలలో 3.45 సెంమీలు, చిన్నమావంధిలో 3.15 సెంమీల వర్షపాతం నమోదైంది.