Weather Report: తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా వరి, కందులు మొదలైన వర్షాధారిత పంటల సాగు రైతులకు ఇది గుడ్ న్యూస్. అయితే మరోవైపు వర్షం కారణంగా జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.
Read Also:CM Revanth Reddy: నేడు ఢిల్లీకి పయనం కానున్న సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇలా..!
సోమవారం (జులై 7) నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. అలాగే మంగళవారం వర్షం పెరిగి అతి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో హెచ్చరికలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
Read Also:Zim vs SA: వాళ్లకు కాస్త చెప్పండయ్యా.. అది టీ20 కాదు టెస్టు మ్యాచ్ అని.. ఆ కొట్టం ఏంటయ్యా బాబు..!
ఇది ఇలా ఉండగా.. వర్షాలు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ.. ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లను జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు.
ఇక బుధవారం (జులై 9) నాడు వర్షాలు మరింత విస్తరించనున్నాయని, గురువారం (జులై 10) నాటికి వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వానలు వ్యవధి తక్కువగా ఉన్నా, ప్రభావం మాత్రం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇక ఆదివారం (జులై 6) నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురిశాయి. రాష్టంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు చోటుచేసుకున్నాయి.
