Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Vahan Portal: తెలంగాణలో వాహన్ పోర్టల్ అమలు ప్రారంభమైంది. వాహన సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయడానికి రవాణా శాఖ కీలక చర్యలు చేపట్టింది. దశల వారీగా వాహన్ వ్యవస్థను అమలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 68,846 టెంపరరీ రిజిస్ట్రేషన్లు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్యాన్సీ నంబర్ మాడ్యూల్ కూడా విజయవంతంగా అమలవుతుండగా, 1,880 ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్ రిజర్వేషన్లు నమోదయ్యాయి. పారదర్శకంగా నంబర్ల కేటాయింపునకు వాహన్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగపడుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 23,705 వాహనాలకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ చేశారు. వాహన్ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు పెండింగ్ కేసులపై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐసీ సాంకేతిక సహకారంతో అమలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇంకా మిగిలిన అదనపు మాడ్యూల్స్‌ను కూడా దశల వారీగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 15 రోజుల్లో వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పారదర్శక, సమర్థవంతమైన డిజిటల్ సేవలను ప్రజలకు అందించడం రవాణా శాఖ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!