Site icon NTV Telugu

Tragic Incident: అన్నం పెట్టే చెట్టుపైనే.. కల్లు గీయడానికి వెళ్లి గీత కార్మికుడు మృతి..

Tragic Incident

Tragic Incident

Tragic Incident: కుల వృత్తిని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్న ఆ కుటుంబ యజమాని, రోజూలాగానే కుల వృత్తిలో భాగంగా కళ్లు గీయడానికి తాటిచెట్టుపైకి ఎక్కాడు. పాపం అన్నం పెట్టే చెట్టుపైనే తన ప్రాణాలను పోతాయని కలలో కూడా ఊహించి ఉండడు. కళ్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కిన ఒక గౌడన్న.. అన్నం పెట్టే చెట్టుపైనే తన ప్రాణాలను వదిలిన హృదయ విదారకరమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసింది.

READ ALSO: Pawan Kalyan: తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం రద్దు..! 336 వార్డుల్లో జనసేన పోటీ..

తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాయిలి కిషన్ అనే గీత కార్మికుడు.. తన కుల వృత్తి అయిన గీత వృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈక్రమంలో రోజులాగే ఈ రోజు కూడా సాయిలి కిషన్ కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కానీ ప్రమాదవశాత్తు ఆ తాటి చెట్టుపైనే ప్రాణం విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. తాటి చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయిన ఆ గౌడన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తు్న్నారు.

READ ALSO: Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో ‘మియా మ్యాజిక్’ ?

Exit mobile version