NTV Telugu Site icon

TG TET: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

Tg Tet

Tg Tet

TG TET: తెలంగాణ టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను రిలీజ్‌ చేశారు. జనవరి 2 నుండి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో రోజూ రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2లకు కలిపి సుమారు 2,75,773 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

టెట్‌కు వచ్చిన దరఖాస్తులు 2 లక్షల 75 వేల 773

Paper -I : 94335
Paper -II : 181438
Total: 275773

Read Also: KTR Letter: దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

Show comments