Site icon NTV Telugu

Eyebrow Coding: వామ్మో చిచ్చర పిడుగులు.. “కనుబొమ్మల”తోనే మాట్లాడేస్తారు..

Eyebrow Coding

Eyebrow Coding

Eyebrow Coding: సమాచారాన్ని చేరవేయడానికి భాష ఒక ప్రాథమిక సాధనం. ఆలోచనలు, భావాలు, వాస్తవాలను మాటలు, లిఖితపూర్వకంగా వ్యక్త పరుస్తాం. అంతేకాదు.. సంజ్ఞల ద్వారా సైతం మాట్లాడొచ్చు. సంజ్ఞల ద్వారా భావాలను వ్యక్త పర్చడంలో ఇద్దరు చిచ్చర పిడుగులు ఆరితేరారు. ఈ ఇద్దరు విద్యార్థినుల మధ్య ఒక్క మాట కూడా వినిపించదు. పెదవులు కదలవు. అయినప్పటికీ సమాచార మార్పిడి మాత్రం అద్భుతంగా జరుగుతుంది. ఒకరు కనుబొమ్మలను కదిలిస్తే చాలు.. మరొకరు ఆ సంకేతాన్ని క్షణాల్లో అర్థం చేసుకుని పేపర్‌పై వాక్యాలుగా రాసేస్తారు. ఇది ‘ఐబ్రో కోడింగ్’ లిపి. ఈ వినూత్న ఆవిష్కరణకు రూపకర్త తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు మధు.

READ MORE: Team India: గంభీర్‌ను కోచ్గా తొలగించేందుకు ప్లాన్.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు షాకింగ్ ఆన్సర్!

మధు మార్గదర్శకత్వంలో విద్యార్థినులు స్నిగ్ధ, తన్మయి ఈ ప్రత్యేక కమ్యూనికేషన్ విధానంలో నైపుణ్యం సాధించారు.. తిరుపతి వేదికగా ఆదివారం నిర్వహించిన భారతీయ వైజ్ఞానిక సమ్మేళనంలో ఈ ‘ఐబ్రో కోడింగ్’ విధానాన్ని విద్యార్థినులు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంగ్లిష్ అక్షరాలు (A నుంచి Z వరకు), సంఖ్యలు (0 నుంచి 9 వరకు)కు ప్రత్యేకమైన కోడ్‌ను రూపొందించారు. కుడి కనుబొమ్మ కదలిక, ఎడమ కనుబొమ్మ కదలిక, రెండు కనుబొమ్మలను కలిపి కదల్చడం వంటి వివిధ కాంబినేషన్లతో అక్షరాల కోడ్‌ను రూపొందించారు.

Exit mobile version