NTV Telugu Site icon

Telangana Student: అమెరికాలో జెట్‌స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!

Telangana Student Died

Telangana Student Died

Telangana Student Died in US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పిట్టల వెంకట రమణ (27) మరణించాడు. మార్చి 9వ తేదీన విస్టిరీయా ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌లో వెంకట రమణ మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నాడు. వెంకట రమణ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు కారణాలతో ఎనిమిది మంది భారతీయ మరియు భారతీయ సంతతి విద్యార్థులు అమెరికాలో మరణించారు.

స్థానిక మీడియా ప్రకారం.. మార్చి 9న మధ్యాహ్నం 1:30 గంట తర్వాత (స్థానిక కాలమానం ప్రకారం) విస్టిరీయా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్ వద్ద వెంకట రమణ యమహా పర్సనల్‌ వాటర్‌క్రాఫ్ట్‌ (జెట్‌స్కీ)ను అద్దెకు తీసుకున్నాడు. ఫ్యూరీ ఫ్లోటింగ్‌ ప్లేగ్రౌండ్‌లో దానిని వాడాడు. ఆ సమయంలో మరో జెట్‌స్కీ వేగంగా ఢీకొనడంతో.. వెంకట రమణ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో జెట్‌స్కీ నడుపుతున్న 14 ఏళ్ల బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Also Read: IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్‌ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!

పిట్టల వెంకట రమణ తెలంగాణ రాష్ట్రంలోని కాజీపేట్‌ ప్రాంతంకు చెందిన వాడు. అతడి తల్లిదండ్రులు కాజీపేట్‌లో నివాసం ఉంటున్నారు. వెంకట రమణ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీలో ఫిజియోథెరపీ పూర్తి చేశాడు. ఆపై ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. మరో రెండు నెలల్లో అతడి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తయ్యేది. ఈ లోపే అతడు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. వెంకట రమణ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.