NTV Telugu Site icon

Hyderabad: అంబరాన్నంటిన రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు

New Project (17)

New Project (17)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స సంబరాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి, పలువురు మంత్రులు తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు వేడుకలకు వచ్చారు. వారు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 కళలను ప్రదర్శించారు. ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు కిటకిటలాడాయి. వేడుకలు జరుగుతున్న సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకమేర్పడింది. వేడుకల్లో భాగంగా జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్‌ వాక్‌ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అందెశ్రీ, కీరవాణి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

READ MORE: Health tips: 40 ఏళ్ల తర్వాత కూడా యవ్వనంగా ఉండాలంటే ఇవి ట్రై చేయండి

కాగా.. ఉదయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్రీయ గీతం జయజయహే తెలంగాణ గేయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూన్‌ 2 ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.