తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.
Also Read : Umair Sandhu: నిన్న పవన్ ఉమనైజర్ అన్నాడు.. నేడు సమంత అబార్షన్ అంటున్నాడు
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించబోనని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీసుకుంది. ఈ నెల 15 తేదీన ఉదయం 11 గంటలకు బండి సంజయ్ విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులను జారీ చేసింది.
Also Read Honey Bee Attack : ఎమ్మెల్యే పై తేనేటీగల దాడి.. తప్పించుకున్న రాజయ్య
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలో బండి సంజయ్ ఉన్నారు. మరి మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఆయన ఎలా స్పందిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మార్చి 15వ తేదీన రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మహిళా కమిషన్ ముందు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఉమెన్స్ కమిషన్ హెచ్చరించింది.
