Site icon NTV Telugu

SSC Supplementary Results: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Ssc

Ssc

SSC Supplementary Results 2024: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 46,731 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 73.03 శాతమని అధికారులు తెలిపారు. బాలుర ఉత్తీర్ణత శాతం 71.01 కాగా.. 76.37 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

Read Also: CM Revanth Reddy: సంస్కర‌ణ‌ల‌తో దేశ ప్రగ‌తిని పీవీ పరుగులు పెట్టించారు..

బాలికలు, బాలుర కంటే 5.36 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 100 శాతము ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అదే విధముగా రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ ఉత్తీర్ణత శాతము అనగా 42.14 సాధించి చివరి స్థానములో ఉంది.

ఫలితాల కోసం.. క్లిక్ చేయండి

Exit mobile version