Site icon NTV Telugu

TGSEB: SSC, ఇంటర్ బోర్డుల విలీనం తథ్యం..

Ssc

Ssc

TGSEB: ఎస్ఎస్‌సీ, ఇంటర్ బోర్డులు విలీనం కానున్నాయి! తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ లో పొందు పర్చిన ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపర్చింది. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB) ఏర్పాటు చేయనుంది. గ్రేడ్స్ I నుంచి XII వరకు అన్ని తరగతులను పర్యవేక్షించే ఒకే సంస్థగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGSEB).. ఈ బోర్డు ద్వారా అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ స్థాయుల్లో పాఠ్య ప్రణాళిక (Curriculum), మదింపు (Assessment)లో సమగ్రత (Coherence) ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్రేడ్ X , XII వద్ద ఉండే కీలకమైన పరీక్షలు (పబ్లిక్ ఎగ్జామినేషన్స్), సర్టిఫికేషన్ ప్రక్రియలను TGSEB నిర్వహించి, పర్యవేక్షిస్తుంది.

READ MORE: Akhanda 2 Thaandavam: మరికొన్ని గంటల్లో రిలీజ్.. ‘అఖండ 2’ నుంచి ఎమోషనల్‌ ఆడియో సాంగ్‌!

Exit mobile version