Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఎన్‌సీఈఆర్టీ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా రిజల్ట్స్ విడుదల చేశారు. ఇక ఈ ఏడాది 95.15 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా స్పష్టం చేశారు. చివరి ఏడాది 92.78 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా.. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది కన్నా 2.37 శాతం ఎక్కువ నమోదైంది. ఈసారి సైతం బాలికలదే పైచేయి కనబరిచారు. మీరు పరీక్షల ఫలితాలు తెలుసుకోవాలంటే కింది లింక్‌ను క్లిక్ చేయండి. అక్కడ హాల్‌టికెట్ నంబరు ఎంటర్ చేయండి. ఈజీగా మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. ఈసారి ఫలితాల్లో కేవలం గ్రేడ్లు మాత్రమే కాకుండా, సబ్జెక్టుల వారీగా మార్కులు సైతం కనిపించేలా ఏర్పట్లు చేశారు. దీంతో విద్యార్థులు తమ ప్రదర్శనను మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం లభించింది. అలాగే తొలిసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు 80969 58096 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే ఫలితాలు పొందవచ్చు. డిజిటల్ విధానంలో ఫలితాల అందుబాటు కల్పించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు సులభతరం చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!