Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..

!0

!0

Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఎన్‌సీఈఆర్టీ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా రిజల్ట్స్‌ విడుదల చేశారు. ఇక ఈ ఏడాది 95.15 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా స్పష్టం చేశారు. చివరి ఏడాది 92.78 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా.. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది కన్నా 2.37 శాతం ఎక్కువ నమోదైంది. ఈసారి సైతం బాలికలదే పైచేయి కనబరిచారు. మీరు పరీక్షల ఫలితాలు తెలుసుకోవాలంటే కింది లింక్‌ను క్లిక్ చేయండి. అక్కడ హాల్‌టికెట్ నంబరు ఎంటర్ చేయండి. ఈజీగా మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. ఈసారి ఫలితాల్లో కేవలం గ్రేడ్లు మాత్రమే కాకుండా, సబ్జెక్టుల వారీగా మార్కులు సైతం కనిపించేలా ఏర్పట్లు చేశారు. దీంతో విద్యార్థులు తమ ప్రదర్శనను మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం లభించింది. అలాగే తొలిసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు 80969 58096 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే ఫలితాలు పొందవచ్చు. డిజిటల్ విధానంలో ఫలితాల అందుబాటు కల్పించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు సులభతరం చేసినట్లు అధికారులు తెలిపారు.

Telangana SSC Results 2026