Solar Power : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంట సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించేందుకు వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకంలో భాగంగా, రాష్ట్రంలోని రైతులకు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లూ ఈ వివరాలను వెల్లడించారు.
పథక లక్ష్యం
రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వారికి అదనపు ఆదాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. పాడుబడిన లేదా సాగుకు అనుకూలం కాని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేసి, రైతులు తమ భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా నష్టాలను ఆదాయ మార్గాలుగా మార్చుకునే అవకాశం పొందుతారు.
ప్రధాన వివరాలు:
0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది.
ఈ పథకాన్ని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TG REDCO) నోడల్ ఏజెన్సీగా అమలు చేస్తుంది.
ఉత్పత్తి చేసిన విద్యుత్తును డిస్కంలు రూ. 3.13/యూనిట్ ధరకు 25 ఏళ్లపాటు కొనుగోలు చేస్తాయి.
అర్హతలు:
రైతులు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లు, వాటర్ యూజర్ అసోసియేషన్‌లు ఈ పథకంలో భాగస్వాములు కావడానికి అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ:
TG REDCO వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సమీప TG REDCO జాబితాలో పేర్కొన్న సబ్‌స్టేషన్ పరిధిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం దరఖాస్తు సమర్పించవచ్చు.
పర్యావరణం, ఆర్థికానికి లాభాలు:
ఈ పథకం ద్వారా కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుండగా, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. పునరుద్ధరణీయ ఇంధన వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య, దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.
Shruti Haasan : క్రిస్మస్ వేడుకల్లో శ్రుతీ హాసన్.. లుక్స్ క్యూట్