ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా సుమారు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ లను టెస్టులు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లు, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారుదారులు లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
READ MORE: SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం
విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ – 2006 ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టాస్క్ ఫోర్స్ , ఫుడ్ సేఫ్టీ అన్ వీల్స్ (ఫుడ్ లాబ్స్), ఆకస్మిక తనిఖీలు, అవగాహన సదస్సులను నిరంతరం నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరు పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
READ MORE: CM Chandrababu: నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..
కాగా.. మనం తీసుకునే ఆహారం నాణ్యత లోపం ఉంటే అనారోగ్య సమస్యలు మన దరికి చేరుతాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా భోజనప్రియలు బయటి హోటల్, రెస్టారెంట్లలో భుజించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే భోజనం ప్రియుల ఆదరణకు నోచుకుంటున్న పలు హోటల్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శభాష్ అనిపించుకుంటూ ఉండగా, మరికొన్ని హోటల్, రెస్టారెంట్ల యాజమాన్యాలు మాత్రం ఫ్రిజ్ లలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతూ భోజన ప్రియులకు అందిస్తున్న తీరును అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.