Site icon NTV Telugu

Dhanush Srikanth: తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు రూ. కోటి 20 లక్షల నజరానా..

Dhanush Srikanth

Dhanush Srikanth

తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.కోటి 20 లక్షల నజరానా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రకటన చేశారు. టోక్యోలో జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్‌ ధనుష్ శ్రీకాంత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో ధనుష్ శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు.

Also Read:IBomma Ravi: ఐ-బొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ప్రేమ పెళ్లే.. నా కోడలు మంచిదంటూ..

తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ జర్మనీ సుహల్ లో 2023 లో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో బంగారం పతకాన్ని సాధించాడు. వీటితో పాటు 2024 సెప్టెంబర్ లో వరల్డ్ డెఫ్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌లో హైదరాబాద్‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌మూడో గోల్డ్ సాధించాడు. జర్మనీలోని హనోవెర్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌‌‌ రైఫిల్‌‌‌‌‌ మిక్స్‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌ ఫైనల్లో శ్రీకాంత్‌–మోహిత్ సంధు 17–5 స్కోరుతో ఇండియాకే చెందిన నటాషా జోషి–మొహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూర్తజాపై గెలిచింది. నటాషా, మూర్తజాకు సిల్వర్ లభించింది. కాగా, ధనుశ్‌‌‌‌‌‌‌‌‌ఇప్పటికే 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లోనూ స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు.

Exit mobile version