Site icon NTV Telugu

Telangana Secretariat: CJI బిఆర్. గవాయి పై దాడికి నిరసన

Telangana Secretariat

Telangana Secretariat

Telangana Secretariat: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బిఆర్. గవాయి‌పై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ సచివాలయంలో ఆగ్రహావేశం వ్యక్తమైంది. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని “జస్టిస్ గవాయి జిందాబాద్”, “దళితులపై దాడులు ఆపాలి”, “న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు. సి.జె.ఐ. బిఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, చట్ట వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Prithvi Shaw: బ్యాట్‌ ఎత్తడం, కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం.. పృథ్వీ షా ఇక మారాడా?

సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేతలు మాట్లాడుతూ .. “బిఆర్. గవాయి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి. ఆయనపై దాడి జరగడం అంటే న్యాయవ్యవస్థ, సామాజిక సమానత్వం మీద దాడి చేసినట్లే. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ” అని పేర్కొన్నారు. నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు బి.ఆర్. గవాయికి సంఘీభావం వ్యక్తం చేస్తూ, ఆయనకు పూర్తి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Jammu Kashmir: కాశ్మీర్ అడవుల్లో ఇద్దరు పారా కమాండోలు మిస్సింగ్..

Exit mobile version