NTV Telugu Site icon

Sankranthi Holidays : జనవరి 11 నుంచి 17 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు..

Students

Students

Sankranthi Holidays : తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం, పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉండగా, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు హాలిడేలు ప్రకటించాయి. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వం ఈసారి రెండు రోజుల ముందుగానే సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మార్పుతో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి పండుగ ప్రణాళికలను ముందుగానే చేయగలిగే పరిస్థితి ఏర్పడింది.

 
Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
 

సెలవుల తేదీలపై స్పష్టత రావడంతో తల్లిదండ్రులు సొంతూళ్లకు ప్రయాణించడానికి సన్నాహాలు ప్రారంభించారు. పిల్లలను బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా పండుగను గడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. పండుగ వేళ కుటుంబంతో సమయాన్ని గడపడం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలు తీరాయి.

ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆ రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించాయి. ఈ రెండుచోట్ల సెలవుల ప్రకటనతో పండుగ వేళ ఇద్దరు రాష్ట్రాల్లో ప్రజలు ఉత్సాహంగా ఆరంభం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెలవులు పొడిగించిన ఈ నిర్ణయం పాఠశాల విద్యార్థులు, వారి కుటుంబాలకు పండుగ వేళ మరింత సంతోషాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.

 
Arvind Kejriwal: నితిన్ గడ్కరీని ప్రశంసించిన అరవింద్ కేజ్రీవాల్
 

Show comments