Komati Reddy Venkat Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” అనే స్పష్టమైన విజన్‌తో పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఏస్ టెక్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ టార్గెట్ అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 5.75లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు మా గేమ్ చేంజర్. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు 39 రేడియల్ రోడ్లు నిర్మాణం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఐటీ, ఫార్మా, ఏఐ లాంటి పోటీ రంగాలను ప్రోత్సహిస్తున్నాం.. పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ మారుతోందని వెల్లడించారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో పురోగమిస్తోంది.. రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన యాక్షన్ లో ఎకరం 174కోట్లు పలికిందని గుర్తు చేశారు.
READ MORE: TTD Adulteration Ghee Case: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ.. వెలుగులోకి సంచలన అంశాలు..!
హైదరాబాద్‌లో ఎటు చూసినా హై రైజ్ భవనాలు కనిపిస్తాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. “మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు అందుబాటు ధరలో సొంతింటి కల నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నాం.. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సమానంగా అభివృద్ది చేస్తూ…పరిశ్రమల స్థాపన..ఉపాధి కల్పన అంశాలపై ప్రధాన దృష్టి సారించాం.. పొల్యూషన్ ఫ్రీ సిటీ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నాం..ఇక్కడ జరిగిన ఇంత మంచి చర్చపై క్యాబినెట్ లో ప్రస్తావిస్తా..” అని వెల్లడించారు.
READ MORE: Trump Video: దావోస్‌లో ఆసక్తికర పరిణామం.. అసిమ్ మునీర్ వైపు వేలు చూపిస్తూ నవ్వుకున్న ట్రంప్-షెహబాజ్
