NTV Telugu Site icon

Telangana Rice to Philippines: కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం..

Telangana Rice To Philippin

Telangana Rice To Philippin

Telangana Rice to Philippines: కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం.. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.. అయితే, ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నారు.. లోడింగ్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న షిప్‌ను జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..

Read Also: Khammam Politics : ఖమ్మం ఈద్గాలో పొలిటికల్ వివాదం

ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన తెలంగాణ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి.. తెలంగాణ కేబినెట్‌ విస్తరణ గురించి నాకు సమాచారం లేదన్నారు.. ఫిలిప్పీన్స్ కి 8 లక్షల టన్నులు బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం.. అందులో భాగంగా తొలివిడతగా 12500 టన్నుల బియ్యం పంపిస్తున్నాం అని వెల్లడించారు.. ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి.. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందన్నారు.. మా రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు.. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు.. స్వయంగా నేను వెళ్లి రైస్ ఎగుమతులు పై చర్చిస్తాను అన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..