Site icon NTV Telugu

Telangana Reservoirs Overflow: రాష్ట్రవ్యాప్తంగా నిండుకుండలా జలాశయాలు..

Telangana Reservoirs Overflow

Telangana Reservoirs Overflow

Telangana Reservoirs Overflow: తెలంగాణలోని ప్రధాన నది ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, సింగూరులకు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 40 వరద గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి లక్షా 46 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1089 అడుగులకు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 80 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కొత్త ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 10 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 70,787 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 78,446 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1403 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 17 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉంది.

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 16 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర, 10 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3 లక్షల 57 వేల 333 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.70 అడుగుల వద్ద ఉంది. మొత్తం నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ఇప్పుడు 304 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Meerut: ఉద్యోగం పేరుతో హోటల్ కు పిలిచి.. అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్..

ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. అధికారులు 7 స్పిల్‌వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 58,696 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 58,892 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.607 టీఎంసీలు నిల్వ ఉంది.

Exit mobile version