NTV Telugu Site icon

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంపు

Ts

Ts

Telangana: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి ఇప్పటి వరకు 44 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెంచింది రేవంత్‌రెడ్డి సర్కార్.. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. వివిధ నియామక పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది గుడ్‌న్యూస్‌గా చెప్పుకోవాలి.. అయితే, గత ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచింది.. అందే 10 సంవత్సరాలు పెంచింది.. ఇక, ఈ ప్రభుత్వం రెండు ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..

Read Also: Horrific Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. నిరుద్యోగ యువత నుండి అనేక ప్రాతినిధ్యాలు స్వీకరించబడ్డాయి.. మరిన్ని ఎనేబుల్ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని సడలించడం గురించి ఆలోచిస్తోందని పేర్కొంది ప్రభుత్వం.. నిరుద్యోగ యువత.. యూనిఫాం సేవలు కాకుండా ఇతర పోస్టులకు ఈ వయోపరిమితి వర్తింపజేయనున్నారు.. ప్రభుత్వం అన్ని విషయాలన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత.. రెండేళ్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వరకు యూనిఫాం సేవలకు కాకుండా.. మిగతా పోస్టులకు రెండు సంవత్సరాల కాలం ఈ వర్తింపు ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఏ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం వర్తించదు.. పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలు మొదలైన యూనిఫాం సేవలకు వర్దించదు..