Site icon NTV Telugu

Heavy Rains: అల్లకల్లోలం సృష్టించిన వర్షం.. ఈ ఎనిమిది జిల్లాలకు రెడ్‌ అలర్ట్..

Telangana Heavy Rains

Telangana Heavy Rains

Heavy Rains: తెలంగాణాలో మళ్లీ వర్షం మొదలైంది. పలు జిల్లాల్లో దంచికొడుతోంది. తాజాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అల్లకల్లోలం సృష్టించింది వర్షం. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 14.7 సెం. మీ, మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెం.మీ మేర వర్షపాతం నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా మీన్ పూర్ లో కోమటి కుంటకు గండి పడటంతో పంటపొలాలు నీట మునిగాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట శివారు మోత్కుల కుంటకు గండి పడి నీరు వృథాగా పోతోంది. మెదక్ జిల్లా రెగోడ్‌లో వర్షానికి పెట్రోల్ బంక్ జలమయమయ్యింది. మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండా, సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద లోని మున్యాతండా, గైరాన్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజు మంజీరా నది ఉద్ధృతికి ఏడుపాయల ఆలయం మూతపడింది. అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

READ MORE: Andhra pradesh : సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు!

కాగా.. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 18 వరకు ఈ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఆగస్టు 16, 17న ఉత్తర, తూర్పు జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 16న ఏడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ , ములుగు జిల్లాలకు రెడీ అలెర్ట్ జారీ చేసింది. 8 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

READ MORE: Delhi gangster suicide: ఢిల్లీ జైలులో గ్యాంగ్‌స్టర్ సూసైడ్.. జైలు నంబర్ 15లో ఏం జరిగింది?

Exit mobile version