తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచింది.
Also Read: Snapchat Love: పెద్దపల్లిలో స్నాప్‌చాట్ ప్రేమ.. యువకుడి ఇంటిముందు ఇద్దరు పిల్లల తల్లి ధర్నా!
గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. బుధవారం అయితే భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌పై వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 15 సెంమీ వర్షపాతం నమోదైంది. దాంతో రహదారులు చెరువులను తలపించాయి. ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని నాలాలు ఉప్పొంగాయి. వరద ధాటికి చాలా ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.
