Site icon NTV Telugu

Weather Updates: తెలంగాణలో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. జర జాగ్రత్త..!

Rain Alert

Rain Alert

Weather Updates: తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశముందని పేర్కొంది.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

ఇక హైదరాబాద్ నగరంలో, నిన్నటితో పోలిస్తే నేడు వర్ష తీవ్రత కొంత తక్కువగానే ఉంటుందని ‘తెలంగాణ వెదర్ మ్యాన్’ అంచనా వేశారు. అయితే నగర పరిధిలోని ఘట్‌కేసర్, కీసర, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపారు. కాప్రా, సైనిక్‌పురి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చెర్లపల్లి, నారపల్లి, బోడుప్పల్, నేరేడ్‌మెట్, యాప్రాల్‌ వంటి ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల్లో వర్ష ప్రభావం కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Janhvi Kapoor : అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే యుద్ధాలే జరిగేవి : జాన్వీకపూర్

Exit mobile version